<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>17</hymn_number>
<lyrics>[C1]
   ఈ సాయం కాలమున - యేసు ప్రభో వేడెదము = నీ
   సుదయారస మొల్క - నిత్యంబు మము గావు

[V1]
 చెడ్డ కలల్‌ రాకుండ - నడ్డగించుమి ప్రభో = బిడ్డలము
 రాత్రిలో - భీతి బాపుము తండ్రీ

[V2]
 దుష్టుండౌ శోధకుని - ద్రొక్కుటకు బలమిమ్ము = భ్రష్టత్వమున
 మేము - పండకుండ గాపాడు

[V3]
 నీ యేక పుత్రుండౌ - శ్రీ యేసు నామమున = సాయం
 ప్రార్థన లెల్ల - సరగ నాలించుమా

[V4]
 జనక సుత శుద్ధాత్మ - ఘనదేవా స్తుతియింతుం = అనిశము
 జీవించి రా - జ్యంబు జేయు మామేన్‌</lyrics>
<title>ఈ సాయం కాలమున</title>
</song>